: హాలీవుడ్ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన భారత యువకులు


1991లో విడుదలైన యానిమేటెడ్ సినిమా ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ సినిమాకు లైవ్ యాక్షన్ సీక్వెల్ గా ఈ మధ్యే విడుదలై మంచి వసూళ్లు సాధిస్తున్న హాలీవుడ్‌ సినిమాలో ప్రధాన పాత్రధారి నటి ఎమ్మా వాట్సన్‌ ధరించిన కొన్ని దుస్తులను భారత్‌ కు చెందిన ఇద్దరు యువ డిజైనర్లతో డిజైన్‌ చేయించారు. ఈ మేరకు ఈ సినిమాకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ సినీడ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 18వ శతాబ్దానికి చెందిన దుస్తులను గుజరాత్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్లు కసమ్, జుమా అనే ఇద్దరు యువ డిజైనర్లు డిజైన్ చేశారని తెలిపారు. హాలీవుడ్‌ నటుడు డాన్‌ స్టీవెన్స్‌తో కలిసి ఎమ్మా వాట్సన్ నటించిన ఈ సినిమాలో ఆమె ధరించిన డ్రెస్ ను వీరిద్దరూ చేతితో పట్టుకుని ఉండగా తీసిన చిత్రాన్ని ఆయన పోస్టు చేశారు. 

  • Loading...

More Telugu News