: బ్రిటన్ పార్లమెంటు బయట ఉగ్రదాడి...పార్లమెంటు వాయిదా
లండన్ లోని పార్లమెంటు భవనం సమీపంలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్ ముందు దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. పార్లమెంటు సభ జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు జరగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పార్లమెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. పార్లమెంటు బయట కత్తితో తచ్చాడుతున్న వ్యక్తిని గమనించినట్టు అక్కడి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసులు చెప్పారు.