: సీఎం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే నిరసన .. పదవికి రాజీనామా చేసిన రాజాసింగ్!
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ హైదాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను ఆయనకు పంపినట్టు తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని, నిన్న కేసీఆర్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదని రాజాసింగ్ పేర్కొన్నారు.
కాగా, గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, తన నియోజకవర్గం పరిధిలోని నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం కేసీఆర్ కు రాసిన ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.