: స్మగ్లర్ షూలో వెయ్యి వజ్రాలు లభ్యం!


తన షూలో వజ్రాలు దాచి దర్జాగా అక్రమ రవాణాకు యత్నించిన ఓ స్మగ్లర్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చైనాలోని షెంజెన్ నగరం నుంచి హాంగ్ కాంగ్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న స్మగ్లర్ ను లోహు పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్ ధరించిన షూ సోల్ లో వెయ్యి వజ్రాల వరకు దాచి ఉంచాడని, అవన్నీ 212.9 క్యారెట్ల వజ్రాలుగా గుర్తించామని, సదరు అధికారులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే పోర్ట్ లో ఓ వ్యక్తి తన ఆహారం ప్యాకెట్ లో 1554 వజ్రాలను దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News