: ఐఏఎస్ వెంకటేశ్వరరావు ఆరోపణలు అవాస్తవం.. ఆయనపై కేసు పెడతాం: వెస్ట్ జోన్ డీసీపీ
2 కోట్ల రూపాయలు ఇవ్వలేదని తనపై హత్యకు సహకరించాడంటూ కేసు పెట్టారని ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పోలీసు అధికారులెవరూ డబ్బు అడగలేదని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్ రావు తెలిపారు. తమపై అవాకులు చవాకులు మాట్లాడుతూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్న వెంకటేశ్వరరావుపై మరో కేసు పెడతామని ఆయన హెచ్చరించారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా, ప్రత్యక్షసాక్షుల సమాచారం మేరకే సుకృత్ ను నిందితుడిగా నిర్ధారించామని ఆయన స్పష్టం చేశారు.
హత్య జరిగిన మరుసటి రోజు నాగరాజు కనిపించడం లేదని, ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు, ఉద్దేశపూర్వకంగా తమను తప్పుదోవ పట్టించేందుకు చేసినదని నిర్ధారణ అయిన తరువాతే, సహేతుకంగా రుజువైన తరువాతే అతనిని అరెస్టు చేశామని, ఆయనే పోలీస్ స్టేషన్ కు విచారణకు వచ్చారని డీసీపీ తెలిపారు. ఇప్పుడు ఆయన మాట మారుస్తున్నారని, తమపై బురద జల్లుతున్నారని, దీనిపై చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.