: మెసేజ్ లు ఎక్కువగా పెడుతోందని బాలికను చంపేశాడు!


చిన్నచిన్న విషయాలకే అమెరికా యువత దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న గన్ కల్చర్ వారిని హత్యలు చేసేలా పురికొల్పుతోంది. ఓ చిన్న ఘటన 14 ఏళ్ల బాలిక నిండుజీవితాన్ని బలిగొన్న ఘటన అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...16 సంవత్సరాల బాలుడితో 14 ఏళ్ల డెసెరే టర్నర్ అనే బాలిక స్నాప్‌‌ చాట్ ద్వారా చాటింగ్ చేస్తోంది. మెసేజెస్ ఎక్కువగా పంపిస్తోందన్న ఆగ్రహంతో ఆమెను చంపేయాలని ఆ బాలుడు నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి పథకం రచించాడు.

ముందుగా ఆమె గొంతు కోసి చంపేయాలని భావించాడు. అయితే గొంతు కోసే సమయంలో ఆమె అరుస్తుందని భావించి, ఫిబ్రవరి 16న ఓ కాలువ ఒడ్డుకు రమ్మని చెప్పి అక్కడికి రాగానే గన్ తో తలపై కాల్చి చంపేశాడు. అనంతరం బాలిక కనిపించడం లేదంటూ ప్రచారం చేశాడు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, స్నాప్ ఛాట్ కాల్ డేటా పరిశీలించి బాలుడ్ని విచారించడంతో నిజాన్ని అంగీకరించాడు. మెసేజ్ లు ఎక్కువ చేస్తోందనే విసుగుతోనే ఈ దారుణానికి ఒడిగట్టానని ఆ బాలుడు విచారణలో తెలిపాడు. దీంతో అతనితో పాటు అతని స్నేహితుడ్ని కూడా అరెస్టు చేశారు. మే 8న ఈ కేసుపై విచారణ జరగనుంది. 

  • Loading...

More Telugu News