: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌ షా, ఎస్.ఎం.కృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎస్.ఎం.కృష్ణ మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు కొత్త జర్నీ ప్రారంభమవుతోందని, బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. కర్ణాటకలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ గతంలో పలు కీలక పదవులు చేపట్టానని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి వంటి పలువురు బీజేపీ నేతలతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, ఎస్.ఎం.కృష్ణ తమ పార్టీలో చేరడంతో కర్ణాటకలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News