: తిరువనంతపురం రోడ్లపై సైకిల్ పై తిరిగిన మోహన్ లాల్!


మలయాళ విలక్షణ నటుడు మోహన్ లాల్  తిరువనంతపురం (త్రివేండ్రం)లో సైకిల్ పై చక్కర్లు కొట్టాడు. తెల్లని లుంగీ, చొక్కా ధరించిన మోహన్ లాల్ సాధారణ వ్యక్తిలా సైకిల్ తొక్కుకుంటూ వీధుల్లో ఇటీవల తిరిగాడు. కేరళ పత్రిక కౌముది డెయిలీ ప్రకారం, ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో సిటీలో ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారని పేర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన తిరువనంతపురం సిటీలో ఈ విధంగా సైకిల్ తొక్కుకుంటూ తిరగాలనేది ఆయన చిరకాల కోరికని ఆ కథనంలో పేర్కొంది.

ప్రజలు, అభిమానుల దృష్టిలో పడకుండా ఉండేందుకే ఆ సమయాన్ని ఆయన ఎంచుకున్నట్లు సమాచారం. కాగా, పాథానమ్ థిత్త జిల్లాలోని ఎలంతూర్ గ్రామానికి చెందిన మోహన్ లాల్ తిరువనంతపురం సిటీలో పెరిగారు. మోహన్ లాల్ యుక్తవయసులో ఉన్న సమయంలో తన మిత్రులతో కలిసి ఉదయం సమయంలో సైకిల్ రైడింగ్ కు వెళ్లేవాడట. అక్కడి ప్రముఖ రెస్టారెంట్ ‘ఇండియన్ కాఫీ హౌస్’ లో కాఫీ తాగుతుండేవారు.

  • Loading...

More Telugu News