: ధర్మశాల చేరుకున్న షమీ.. ఆడే ఛాన్స్ ఉందా మరి?


టీమిండియా నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు కోహ్లీ వ్యూహాలు రచించడంలో మునిగిపోయాడు. ఆసీస్ పేసర్ల వేగవంతమైన బంతులను ఎదుర్కొనేందుకు బౌలింగ్ యంత్రాన్ని కూడా వెంట తీసుకెళ్లాడు. అంతటితో ఆగని కోహ్లీ మ్యాచ్ లో పేస్ బౌలింగ్ బలాన్ని పెంచాలని భావిస్తున్నాడు. దీంతో షమీని ధర్మశాల రావాలని కోరాడు. ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకున్న షమీ...కెప్టెన్ పిలుపుతో ధర్మశాల చేరుకున్నాడు. ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. అయితే అతనిని తుది జట్టులోకి తీసుకునేందుకు సెలెక్టర్ల అనుమతి తీసుకోనున్నాడు. షమీ కచ్చితమైన బంతులతో పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీయడంలో కూడా నేర్పరి అన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News