: మాజీ ప్రియురాలితో సల్మాన్... 'టైగర్ జిందాహై' అంటున్నాడు


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలితో ప్రేమను పట్టాలెక్కిస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్నటి వరకూ లులియా వంతూర్ తో పీకల్దాక ప్రేమలో మునిగిన సల్మాన్...తాజాగా కత్రినా కైఫ్ కు మరోసారి అండగా నిలవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్, కత్రినా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్ ను 'టైగర్ జిందా హై' పేరుతో పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తొలి స్టిల్ ను సల్మాన్ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశాడు. దీంతో మరోసారి మాజీ ప్రియురాలితో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, సల్మాన్ నటించిన 'ట్యూబ్ లైట్' సినిమా ఈ జూన్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. 

  • Loading...

More Telugu News