: నెల్లూరు జిల్లాలో 108 వాహనంలోనే ప్రసవం!
కాన్పు కోసం ఆసుపత్రికి వెళుతున్న ఓ గర్భిణికి 108 వాహనంలోనే ప్రసవం అయిన ఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం వెలిగాజులపల్లెలో చోటుచేసుకుంది. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే... వెలిగాజులపల్లెకు చెందిన దీపిక అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే 108కు ఫోన్ చేసి ఆమె కుటుంబ సభ్యులు అందులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రంగన్నగుంట సమీపంలో వాహనంలోనే ప్రసవించింది. ఈఎంటీ మురళీ, పైలెట్ కిషోర్ ఆమెకు చికిత్స అందించారు.