: టీడీపీ ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ మంచోడు...ఎవరినీ తిట్టరు: జగన్ కితాబు


టీడీపీ ఎమ్మెల్యేల్లో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంచోడని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్ కితాబునిచ్చారు. టీడీపీ అంటే అంతెత్తున లేచిపడే జగన్ బాలయ్యను పొగడడమేంటన్న అనుమానం వచ్చిందా?... జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఈ రోజు అసెంబ్లీలో సరదాగా మాట్లాడారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి జగన్ మాట్లాడుతూ, బాలకృష్ణ ఎవరినీ తిట్టరు, ఎవరినీ విమర్శించరని కితాబిచ్చారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... 'జగన్ కామెంట్‌ నిజమేనా?' అంటూ బాబురావును అడిగారు. దీనికి బాబురావు నిజమేనని సమాధానమిచ్చారు. అంతేకాకుండా, జగన్ గతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారని కదిరి బాబూరావు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ అంతా నవ్వేశారు. 

  • Loading...

More Telugu News