: టీవీ షోలో కోటి గెలుచుకున్న పోర్టర్ భార్య


ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఒక సాధారణ పోర్టర్ తన భార్యను ప్రోత్సహించి ప్రభుత్వ ఉద్యోగిని చేశాడు. అంతేకాదు, అతడి ప్రోత్సాహంతోనే ఆమె ఒక టీవీ షోలో కోటి రూపాయల ప్రైజ్ గెలుచుకుంది. 38 ఏళ్ల సనుజా రాజన్ తిరువనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తోంది. ఆసియానెట్ చానల్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' తరహాలో ఒక గేమ్ షో నిర్వహిస్తోంది. అందులో పాల్గొన్న సనుజా 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి ఈ కార్యక్రమంలో కోటి గెలుచుకున్న తొలి విజేతగా గుర్తింపు పొందారు.

తమది కులాంతర వివాహమనీ, ఎవరి నుంచీ ప్రోత్సాహం అందలేదని ఈ సందర్భంగా సనుజా చెప్పింది. ఆ సమయంలో భర్తే తనను ప్రోత్సహించడంతో కండక్టర్ ఉద్యోగం సంపాదించానని వెల్లడించింది. అది భర్తకు నచ్చకపోవడంతో మళ్లీ పరీక్షలు రాసి కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం సొంతం చేసుకున్నానని తెలిపింది. తన భర్తకు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉందని, ఒక వేళ రాకుంటే ప్రైజ్ మనీలోంచి కొంత వెచ్చించి ట్యాక్సీ నడుపుకునేందుకు కారు కొనుగోలు చేస్తానని సనుజా చెప్పింది.

  • Loading...

More Telugu News