: అందుబాటులోకి మరో 1200 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఈడీ
రాష్ట్ర రాజధాని నుంచి ప్రయాణీకులు సొంత ఊళ్లకు పయనమౌతున్నారు. ఈ వారంతో రాష్ట్రంలో శుభకార్యాల సీజన్ ముగియనుండటంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 1200 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఈడీ తెలిపారు.