: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే...
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ మరోసారి నిలిచింది. వరుసగా నాలుగో సంవత్సరం ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో హాంకాంగ్, మూడో స్థానంలో జ్యూరిచ్ నగరాలు నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టోక్యో, జపాన్, ఒసాకా, సియోల్, జెనీవా, ప్యారిస్, న్యూయార్క్, కోపెన్ హెగెన్ లు నిలిచాయి. ఈ సర్వేను ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించింది. 133 నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. 160 రకాల వస్తువులు, సేవలను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. టాప్ 6 ఖరీదైన నగరాల్లో 5 నగరాలు ఆసియాకు చెందినవే కావడం గమనార్హం. ఇక మన దేశం విషయానికి వస్తే ఢిల్లీ 124వ స్థానంలో, చెన్నై 127, బెంగళూరు 131 స్థానాల్లో నిలిచాయి.