: భారత్ లో శాంసంగ్‌ పే యాప్‌ విడుదల!


పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం భార‌త్‌లో న‌గ‌దుర‌హిత లావాదేవీలు పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో దేశంలో మొబైల్ ఆధారిత చెల్లింపులు చేసుకునే యాప్‌లు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా శాంసంగ్‌ ఇండియా కూడా తన మొబైల్‌ వాలెట్‌ పేమెంట్‌ యాప్‌ను ఈ రోజు అధికారికంగా విడుద‌ల చేసింది. రిజిస్టర్డ్‌ కస్లమర్ల కోసం శాంసంగ్‌ పే సేవలను ప్రారంభిస్తున్న‌ట్లు పేర్కొంది. అయితే, ఈ యాప్ గెలాక్సీ నోట్‌ 5, గెలాక్సీ ఎస్7,  గెలాక్సీఎస్‌6 ఎడ్జ్ + గెలాక్సీ  7 (2017), గెలాక్సీ ఏ5 (2017), గెలాక్సీ ఏ 7 (2016), గెలాక్సీ ఏ5 (2016) మొబైల్స్‌లో మాత్ర‌మే పని చేస్తుంది. ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేసే స‌మ‌యంలో పాస్‌వర్డ్‌, ఓటీపీ కూడా అవసరం ఉండ‌దు.

కేవలం పే అండ్‌ గో ఆప్ష‌న్ల ద్వారా ఈ యాప్ లో సులువుగా చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని, ఈ యాప్‌ మాగ్నటిక్‌ సెక్యూర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆధారంగా పనిచేస్తుందని ఆ సంస్థ ప్ర‌తినిధులు ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఆ యాప్ ద్వారా యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ డెబిట్ లేక‌ క్రెడిట్ కార్డుల ద్వారా యూజ‌ర్లు చెల్లింపు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. అలాగే ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ‌ క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవడానికి వీలు ఉందని చెప్పారు. ఈ యాప్ ఇప్ప‌టికే 12 దేశాల్లో వినియోగంలో ఉంది.

  • Loading...

More Telugu News