: మరో నిర్ణయం తీసుకున్న యూపీ కొత్త సీఎం... ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కాలపై నిషేధం
ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యానాథ్ పలు నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే క్రమంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆదేశాలను జారీ చేశారు. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. పాన్ మసాల, గుట్కాలను ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.