: రజనీకాంత్ సినిమా సెట్ లో మీడియా ప్రతినిధులపై దాడి


ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో స్టార్ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'రోబో 2.0' సినిమా షూటింగ్ స్పాట్ లో ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడి జరగడం కలకలం రేపుతోంది. దీని వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తున్నారు. దీనిని కవర్ చేసేందుకు ఇద్దరు మీడియా ప్రతినిధులు వెళ్లారు. సెట్ కు సంబంధించిన ఫోటోలు తీయడంతో వారిద్దరిపైన యూనిట్ బౌన్సర్లు దాడి చేశారు. దీనిపై వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ లో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

  • Loading...

More Telugu News