: కట్టప్పపై మండిపడుతున్న కన్నడ సంఘాలు!


‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ పై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే, గతంలో కావేరీ నదీ జలాల పోరాట సమయంలో కన్నడ నేతలను అవహేళన చేస్తూ సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి-2’ చిత్రం త్వరలో దేశ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని కన్నడ సంఘాలు మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో విడుదల కానీయమని కర్ణాటక రక్షణ వేదిక నేత ప్రవీణ్ శెట్టి సహా ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సారా గోవిందు హెచ్చరించారు. ‘కట్టప్ప... ఓ కెట్టప్ప’ అంటూ కన్నడ భాషలో వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ, ‘కెట్టప్ప’ అంటే చెడ్డవాడు అని కన్నడ భాషలో అర్థం. కాగా, బెంగళూరులోని ఫిలించాంబర్ వద్ద కన్నడ సంఘాలు ఈ విషయంపై నిన్న ధర్నాకు దిగాయి. 

  • Loading...

More Telugu News