: పోకిరీల ఆటకట్టించేందుకు యూపీ కొత్త సీఎం ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో ముందడుగు వేశారు. రోడ్లపై అమ్మాయిల వెంటపడుతూ హింసించే పోకిరీలకు ముకుతాడు వేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పోలీసులు ఈవ్ టీజింగ్ వ్యతిరేక టీమ్స్‌ని ఏర్పాటు చేశారు. లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ టీమ్స్ ఉండనున్నాయి.
అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లోనూ ఈ టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థినులను వేధించే పోకిరీలను అదుపులోకి తీసుకునేందుకు ఈ టీమ్స్ కాలేజీలు, పాఠశాలల సమీపంలోనూ ఉంటాయని అక్కడి పోలీసులు తెలిపారు. పిలిభిత్ లో ఇప్పటికే ఐదుగురు పోకిరీలను అరెస్టు చేశారు. విద్యాలయాల్లో పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈవ్ టీజింగ్ ను అరికడతామని ఎన్నికల ర్యాలీలో అమిత్ షా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.