: రాహుల్ జీ, ఆసక్తి లేకపోతే వెంటనే తప్పుకోండి: సంచలనం సృష్టిస్తున్న యూత్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీఆర్ మహేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీని ముందుండి నడిపించే ఆసక్తి లేకపోతే... వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. "రాహుల్ జీ, మీరు వెంటనే కళ్లు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ జనాల మనసుల్లో నుంచి ఎలా కనుమరుగు అవుతుందో, ఎలా నాశనం అవుతుందో మీరు చూడాలి" అంటూ మహేష్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు.

సీనియర్ నేత ఏకే ఆంటోనీ కూడా మౌనమునిలా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధీరన్ వైదొలగడంతో... పక్షం రోజులుగా నాయకుడే లేకుండా పార్టీ కొనసాగుతోందని తెలిపారు. కేరళలోని సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో పార్టీ పరిస్థితి ఇలా ఉండటం దారుణమని అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పార్టీ ఇలా డీలా పడటం మంచిది కాదని తెలిపారు. 

  • Loading...

More Telugu News