: ప్రేమకు గుర్తుగా 33 టన్నుల ఉల్కరాయిని బహుమతిగా ఇచ్చాడు
ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో పంధా అనుసరిస్తారు. కొంత మంది పువ్వులు లేదా చిన్న బహుమతులు ఇస్తే చైనాకు చెందిన లియూ ఫియి అనే వ్యక్తి మాత్రం తన ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తీకరించాలని భావించాడు. దీంతో తన ప్రియురాలికి 33 టన్నుల ఉల్కరాయిని బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం వారిద్దరూ కష్గర్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. అప్పుడు అక్కడున్న ఈ ఉల్కరాయిని చూసిన తన ప్రేయసి అద్భుతాన్ని చూసినట్టు చూసిందని, దానిని చాలా ఇష్టపడిందని తెలిపాడు.
అందుకే తన ప్రేమకు గుర్తుగా దానిని ఆమెకు ఇవ్వాలని భావించి 1.45 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి, ప్రియురాలికి బహుమతిగా అందజేశాడు. దానిని కొనేందుకు ఏడాదిపాటు డబ్బు సమకూర్చుకున్నాడు. ఆ తరువాతే దానిని కొనుగోలు చేసి, ఆమెకు బహుమతిగా ఇచ్చి తన ప్రేమను వ్యక్తీకరించాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయని లియూ తెలిపాడు. దీంతో ఆమె అతనికి ఓకే చెప్పేసిందని అన్నాడు. త్వరలోనే తమ వివాహం జరుగుతుందని లియూ తెలిపాడు.