: దొంగల భాషపై సోషల్ మీడియాలో పోస్టులు!
మీ ఇంటి ముందున్న గోడలపై పై ఫొటోలో చూపించినట్లు పలు సింబల్స్ తో ఉన్న రాతలు ఉంటే వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయండి. లేదంటే మీ ఇల్లు దోపిడీకి గురికావచ్చు. అవును.. ప్రస్తుతం ఈ సింబల్స్ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టును కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి కూడా షేర్ చేశారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గోడలపై ఇటువంటి రాతలు కనిపిస్తే అవి చిన్న పిల్లలు గీసిన పిచ్చి రాతలేనని తీసిపాడేయకండి. ఆ రాతలకు అనుగుణంగా ఓ 7 సింబల్స్ ను చూపిస్తూ దొంగలు అలా రాసి వెళుతున్నారట. అనంతరం దొంగతనానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారట. పై చిత్రంలో చూపినట్లు TOO Risky అని రాసి ఉంటే దొంగతనం చేయడానికి మీ ఇల్లు రిస్క్ అనిఅర్థం.
Alaramed House అని రాసి ఉంటే అలారమ్, కరెంట్ ఫెన్సింగ్స్ ఉన్న ఇళ్లని, Wealthy అని రాసి ఉన్న సింబల్ ఉంటే చాలా ధనవంతుల ఇళ్లని అర్థం. ఇక మరికొన్ని సింబల్స్‌లో రాసినట్లు Nothing Worth Stealing ఆ ఇంట్లో చోరీ చేసినా పెద్ద ప్రయోజనం లేదని, Previously Burgled అని రాసి ఉంటే గతంలోనే ఓ సారి దొంగతనం జరిగిన ఇళ్లని అర్థం. ఇక Volnerable Female అంటే మహిళలు, వృద్దులు ఉండే ఇళ్లని, Good Target అనే సింబల్ ఉంటే ఆ ఇంట్లో చోరీ చేయడం ఎంతో తేలికని అర్థం. తస్మాత్ జాగ్రత్త!