: సుచీలీక్స్ సుచిత్ర కిడ్నాప్? సినీ పరిశ్రమ పెద్దల హస్తం?
ఈ మధ్య కాలంలో బాగా పాప్యులర్ అయిన వ్యక్తుల్లో తమిళ సినీ గాయని సుచిత్ర ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన పలువురు హీరో, హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు, వీడియోలను లీక్ చేసి, సంచలనం సృష్టించింది సుచిత్ర. సుచీలీక్స్ పేరిట విడుదలైన ఈ ఫొటోలు, వీడియోలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ధనుష్, అనిరుధ్, రానా, ఆండ్రియా, త్రిష, చిన్మయి, హన్సికలాంటి సినీ స్టార్లు సుచిలీక్స్ బాధితులుగా మిగిలిపోయారు.
ఈ నేపథ్యంలో సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించాడు. అంతేకాదు, వైద్య చికిత్స కోసం విదేశాలకు ఆమెను తీసుకెళుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆమె విదేశాలకు వెళ్లిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇంతలోనే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సుచిత్రను కిడ్నాప్ చేశారనే వార్త ఇప్పుడు కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. తమిళ సినీ పరిశ్రమ పెద్దలే ఆమెను కిడ్నాప్ చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.