: విమానంలో పామును మర్చిపోయి వెళ్లిపోయిన ప్రయాణికుడు!
అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో అనియక్ నుంచి యాంకరేజ్ నగరానికి వెళుతున్న విమానంలో ప్రయాణించడానికి తన తల్లితో పాటు ఓ బాలుడు తన సీటులో కూర్చుని తన పక్కనే నిద్రపోతున్న ఓ తెల్లటి పామును గుర్తించాడు. అయితే, అది ఏంటో అర్థం కాక అదేంటని తన తల్లిని అడిగాడు. అది పామని గుర్తించిన ప్రయాణికులు, అది విషపూరితమైనది కాదని, పైగా ఆ పాము హాయిగా నిద్రపోతోందని తెలుసుకొని అంతగా ఆందోళన చెందలేదు. అయితే, ఇంతలోనే ఆ విమానం గాలిలోకి ఎగిరింది. విమాన సిబ్బంది దానిని జాగ్రత్తగా భద్రపరిచి విమానం ల్యాండ్ అయిన అనంతరం దానిని కిందకు తరలించారు.
ఇంతకీ ఆ పాము విమానంలోకి ఎలా వచ్చిందన్న విషయాన్ని పరిశీలిస్తే... ఓ ప్రయాణికుడు తన పెంపుడు శ్వేతనాగును తనతోపాటు విమానంలోకి తీసుకొచ్చి, తన గమ్యం చేరుకున్న తర్వాత దానిని విమానంలోనే మర్చిపోయి విమానం దిగి వెళ్లిపోయాడు. అనంతరం తన పాము కనిపించడం లేదని, విమానంలోనే మర్చిపోయానని ఆ పాము యజమాని విమానాశ్రయ అధికారులను సంప్రదించాడు.