: చంద్రబాబుకు మొహం చూపించలేకపోతున్నాం: కేఈ కృష్ణమూర్తి


ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొహం చూపించలేకపోతున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీని తాము సాధించలేక పోయామని... అందువల్ల చంద్రబాబు ముందుకు రాలేక పోతున్నామని చెప్పారు. మెజార్టీ ఎందుకు తగ్గిందన్న విషయంపై విశ్లేషణ చేసుకుంటామని తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో అంతా కలసి సమన్వయంతో పని చేస్తామని చెప్పారు. చంద్రబాబు తనకు అత్యున్నతమైన డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారని... ఇంతకంటే పెద్ద పదవి ఏముంటుందని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News