: ఫ్లిప్‌కార్ట్‌లో మూడురోజుల బంపర్ ఆఫర్లు ప్రారంభం!


ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ రోజు నుంచి ఈ నెల 24 వ‌ర‌కు ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ కింద టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ పొంద‌చ్చ‌ని తెలిపింది. కాగా, స్మార్ట్‌ఫోన్లలో ప్ర‌ధానంగా మోటో జడ్, జడ్ ప్లే, ఐఫోన్ 7, 7ప్లస్, గూగుల్ పిక్సెల్‌ ధరలపై ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు పేర్కొంది. వీటిపై గరిష్టంగా రూ.1,500 డిస్కౌంట్ ను తమ వినియోగ‌దారులు పొందవ‌చ్చని చెప్పింది.  

అంతేగాక‌, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు జరిపితే అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్ కూడా ప్ర‌క‌టించింది. ప‌లు మోడ‌ళ్ల‌ స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది.


  • Loading...

More Telugu News