: ఏమిటీ దౌర్భాగ్యం?: అసెంబ్లీలో చంద్రబాబు ఆవేదన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నినాదాల మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జలదినోత్సవాన్ని ఉద్దేశిస్తూ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏమిటీ దౌర్భాగ్యమని ప్రశ్నించారు. నినాదాల మధ్య ప్రకటన చేయాల్సి రావడం ఏంటని అన్నారు. అసెంబ్లీలో అందరూ నిబంధనల ప్రకారమే పనిచేయాలని అన్నారు. ప్రతిపక్షం అడ్డుపడుతుందని తాను అసెంబ్లీలో పలు ప్రకటనలు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని నిలదీశారు.
సభలో ప్రతిపక్ష సభ్యలు చెప్పిందే జరగాలంటే ఎలా? అని చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరిగితే బాగుంటుందని అన్నారు. అంతా తమ ఇష్టప్రకారమే చేస్తానని అనడడం సబబు కాదని అన్నారు. తాను కొత్తగా ముఖ్యమంత్రి కాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉన్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి తాము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు జలదినోత్సవంపై ప్రకటన చేస్తోంటే ఇలా ప్రవర్తించడం ఏంటని అన్నారు. తమ ప్రభుత్వం నీళ్లు ఇవ్వట్లేదని అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.