: వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది: స్పీకర్ కోడెల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగుతోంది. వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తరువాత వైసీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తామని కోడెల అన్నారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో ఇలాంటి తీరు ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు వైసీపీ సభ్యుల తీరుపై అధికార పక్ష సభ్యులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి గందరగోళం నెలకొల్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిదానికీ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు.