: కంగనాతో భారీ సినిమా నిర్మించనున్న క్రిష్
నందమూరి బాలకృష్ణతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను నిర్మించి బాలీవుడ్ ను సైతం ఆకర్షించిన దర్శకుడు క్రిష్... ఇప్పుడు మరో భారీ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. తెలుగు చక్రవర్తి చరిత్రతో శాతకర్ణిని నిర్మించి భారీ విజయం సాధించిన క్రిష్... ఇప్పుడు భారత దేశ చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లక్ష్మీబాయ్ పాత్రలో నటించనుందని సమాచారం. ఈ సినిమాకు లక్ష్మీబాయ్ పుట్టినప్పటి పేరు 'మణికర్ణిక' అనే టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్నారు.