: అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి సారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 25న బెల్జియంలోని బ్రసెల్స్ పర్యటనకు ఆయన వెళతారని అక్కడ జరగనున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్) దేశాధినేతల సమావేశంలో పాల్గొంటారని నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టన్‌బర్గ్ తెలిపారు. నాటోతో తమ దేశానికి ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ సమావేశాల్లో పాల్గొనాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాటోకి సంబంధించిన కీలకాంశాలను చర్చించనున్నారని, ఉగ్రవాదంపై పోరాటం అంశాన్ని కూడా వారు చర్చిస్తారని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ నాటోపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అదే సమావేశానికి ట్రంప్ హాజరవుతున్నారు.