: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ సభ్యుల వాగ్వివాదం
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రైతుల సమస్యలపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడంతో సభ 10 నిమిషాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే, అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఒకేసారి మీడియా పాయింట్ వద్దకు వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి పోటీ పడ్డారు. మీడియా ముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని చెవిరెడ్డి అనగా, తమ ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తుందని మంత్రి పల్లె అన్నారు.