: అన్ని రాయితీలు ఇవ్వలేం!: యాపిల్ సంస్థకు భారత్ స్పష్టీకరణ
భారతదేశంలో తమ తయారీ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్న టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. యాపిల్ అడుగుతున్న పన్ను రాయితీలను ఇవ్వలేమని భారత ప్రభుత్వం... ఆ సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది. ఎలాంటి వినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమకు దీర్ఘకాలిక ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వాలని, పన్ను పరిమితుల నుంచి తమను మినహాయించాలని యాపిల్ కోరుతోంది. అయితే ఈ సంస్థ డిమాండ్లను కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరిస్తూ వస్తోంది. త్వరలోనే అమల్లోకి వస్తున్న జీఎస్టీ నుంచి కూడా తమకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని యాపిల్ కోరుతోంది. 15 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ఇవ్వాలని కోరుతోంది. కానీ, వీటికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.