: వెల్‌లోకి వెళ్లి వైసీపీ సభ్యుల ఆందోళన.. శాసనసభ 10 నిమిషాలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు కూడా గందరగోళం చెలరేగింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మూడేళ్లలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏ మాత్రం సరిపోలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనందుకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడంతో శాసనసభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పేర్కొన్నారు.