: ఇంతకు మించి మీకు ఏమీ చేతకాదు: వైసీపీ సభ్యులపై స్పీకర్ మండిపాటు


ఏపీ శాసనసభ సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి. రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. వైయస్ హయాంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనందుకే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదికి రూ. 3,500 కోట్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీలపై ఆయన మాట్లాడుతుండగా స్పీకర్ జగన్ మైక్ కట్ చేశారు. స్పీకర్ చర్యను నిరసిస్తూ వైసీపీ సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, మీకు ఇదే చేతనవుతుందని, ఇంకేం చేతకాదని అసహనం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News