: సీఎం యోగిపై అభ్యంతరకర ఫొటోలు పెట్టిన మహిళపై కేసు నమోదు


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యంతరకర ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ప్రభ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ యువమోర్చా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు బెంగళూరు అడిషనల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) రవి తెలిపారు.

ఓ మహిళతో ఆదిత్యనాథ్ సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోలను ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో పెట్టారు. దీనిపై బీజేపీ నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ రాయచూరులో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించడాన్ని ఓర్చుకోలేకనే ఇలాంటి నీచమైన పనులకు దిగుతున్నారని బీజేపీ యువమోర్చా నేతలు ఆరోపించారు. 

  • Loading...

More Telugu News