: ఆర్కేనగర్ బరి నుంచి తప్పుకోకుంటే చంపేస్తామంటూ మధుసూదనన్‌కు బెదిరింపులు
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానం నుంచి బరిలోకి దిగిన పన్నీర్ సెల్వం వర్గం నేత, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఆర్కేనగర్ నుంచి తప్పుకోవాలని, లేదంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. దీంతో మంగళవారం ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు మధుసూదనన్ తరపు న్యాయవాది ఆర్‌వీ బాబు ఫిర్యాదును డీజీపీ కార్యాలయానికి అందజేశారు. ఆర్కేనగర్ స్థానం నుంచి తప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. పోలీస్ భద్రత కల్పించాలని కోరారు.