: దండం పెడుతున్నా.. మా మీద కోపం ఉంటే తిట్టండి.. కానీ ఆ పని చేయొద్దు : కాంగ్రెస్‌కు హరీశ్‌రావు వేడుకోలు


సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా నీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను, చెరువులను పట్టించుకోలేదని, దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులకు, అనుమతుల్లేని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి మంగళహారతులు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడేమో ప్రాజెక్టులను కడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తమ మీద కోపం ఉంటే తిట్టాలని, అంతేకానీ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ‘‘మీకు దండం పెడుతున్నా.. జనం ఉసురు పోసుకోవద్దు.. ఇక మీ దయ’’ అంటూ చేతులెత్తి వేడుకున్నారు.

  • Loading...

More Telugu News