: రైల్లో బ్రేక్‌ఫాస్ట్ రూ.30.. లంచ్ రూ. 50.. అంతకంటే ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయాలన్న రైల్వే


ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం  సహాయక బృందాలు, రైల్వే అధికారులతో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం రైల్లో అందిస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వేశాఖ విడుదల చేసింది. రైళ్లలో ఆహార పదార్థాలు, శీతలపానీయాలు తదితర వాటికి ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన రైల్వే కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీని ప్రకారం.. టిఫిన్ రూ.30, లంచ్, డిన్నర్ వెజ్ అయితే రూ. 50, నాన్ వెజ్ అయితే రూ.55, ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ లీటర్ రూ.15, కాఫీ, టీ రూ.7గా పేర్కొంది. ఈ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైల్వే శాఖ కోరింది.

  • Loading...

More Telugu News