: అసహజ సంబంధమే డ్రైవర్ హత్యకు కారణం... నిందితుడ్ని వైద్యపరీక్షలకు పంపుతాం: పోలీసులు


హైదరాబాదులోని యూసఫ్ గుడా లోని కళ్యాణి అపార్ట్స్ మెంట్స్ లో హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు ఘటనలో నిందితులు వెంకట్ సుక్రూ, అతని తండ్రి ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించామని తెలిపారు. డ్రైవర్ నాగరాజుతో వెంకట్ సుక్రూకు అసహజ సంబంధం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మద్యం తాగేందుకు కళ్యాణి అపార్ట్ మెంట్స్ వద్ద సెక్యూరిటీ లేని విషయం గమనించి వెళ్లారని చెప్పారు.

మద్యం తాగిన తరువాత అసహజ శృంగారం చేసేందుకు వెంకట్ సుక్రూ బలవంతం చేశాడని, నాగరాజు దీనికి అంగీకరించలేదని, దీంతో ఇటుకతో మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి విషయం వివరించాడని అన్నారు. దీంతో శవాన్ని మాయం చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించాడని, అయితే స్థానికుల అలికిడితో పరారయ్యాడని వారు చెప్పారు. దీంతో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కూడా రంగప్రవేశం చేశారని, సీసీ టీవీ పుటేజ్ లో ఆయన కూడా కనిపించడంతో ఆయనను కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు అసహజ శృంగారానికి అలవాటు పడ్డాడా? లేదా? అన్న విషయం వైద్యపరీక్షలకు పంపి నిగ్గుతేల్చనున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News