: డ్రైవర్ నాగరాజు మర్డర్ మిస్టరీ వీడింది... ఐఏఎస్ అధికారి అరెస్టు


హైదరాబాదులోని యూసఫ్ గుడాలోని ఓ అపార్ట్ మెంట్ పై హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు మర్డర్ మిస్టరీ వీడింది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు వెంకట్ సుక్రుత్ అని తెలిపిన పోలీసులు, హతుడి శవాన్ని మాయం చేసేందుకు కుమారుడికి సహకరించిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కుమారుడిపై ప్రేమతోనే ఆయన శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొంటున్నారు. కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నామని జూబ్లిహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఘటనలో వాస్తవాలు వెల్లడించనున్నారు. 

  • Loading...

More Telugu News