: వైట్ హౌస్ లో ట్రంప్ కూతురికి ప్రత్యేక ఆఫీసు కేటాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కు వైట్ హౌస్ లో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేయనున్నారు. వైట్ హౌస్ లో పశ్చిమ దిశగా ఉన్న వింగ్ లో ఆమెకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు కానుంది. ట్రంప్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్ ఇకపై ఆ ఆఫీసులో భర్త జేడ్ కుష్ నర్ తో పాటు కలిసి వుంటుంది. అధ్యక్షుడు ట్రంప్ కు అల్లుడు జేడ్ కుష్ నర్ చీఫ్ సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సలహాదారుగా ఇవాంకా ఎలాంటి జీత భత్యాలు, హోదా ఆశించడం లేదని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. తండ్రి పాలనలో తన జోక్యం ఉండబోదని తెలిపిన ఇవాంకా ప్రతి సందర్భంలోనూ ట్రంప్ తో కనిపిస్తుండడం విశేషం. తాజాగా జరిగిన జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మోర్కెల్ తో ట్రంప్ సమావేశమైనప్పుడు కూడా ట్రంప్ పక్కనే ఇవాంకా ఉండడం విశేషం.