: రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం అంశం మరోసారి తెరపైకి!
తమిళనాడులో జయలలిత మృతితో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారి మళ్లీ చల్లబడిన విషయం తెలిసిందే. అయితే, జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి వచ్చేనెల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగై అమరన్ ఈ రోజు రజనీ కాంత్‌తో భేటీ అవడం మరోసారి ఆసక్తిరేపుతోంది. అమరన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సోదరుడు.
గతంలో రజనీ కాంత్‌ని ప్రధానమంత్రి మోదీ కలిసిన నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన అభ్యర్థి రజనీని కలవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు రజనీ కొత్త పార్టీ పెడతారని కొందరు భావిస్తున్నారు.