: అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన 'డీజే' అల్లు అర్జున్!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దువ్వాడ జగన్నాథమ్'' సినిమా టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఇప్పటివరకు కొటి వ్యూస్ సాధించింది. కోటి వ్యూస్ సాధించిన సినిమాల సరసన 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్) కూడా చేరిందని అల్లు అర్జున్ తెలిపాడు. అభిమానులు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు.