: నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో.. మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!


ప‌శ్చిమ బెంగాల్‌లో నారద స్టింగ్‌ ఆపరేషన్‌ విషయంలో తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆదేశాల‌ను నిలిపేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు నేడు తెలిపింది. గత ఏడాది మార్చి నెలలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సీడీల్లో కొంత‌మంది టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

  • Loading...

More Telugu News