: ఇస్లాం మతంలోకి మారాలని నా సోదరుడు ఎవరినీ బలవంతపెట్టలేదు: జకీర్ నాయక్ సోదరుడు కరీం
వివాదాస్పద ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయక్ సోదరుడు మహ్మద్ అబ్దుల్ కరీమ్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. జకీర్ నాయక్ ఎవరినీ బలవంతంగా ముస్లిం మతంలో చేర్పించలేదని, ఎవరినీ బలవంతపెట్టలేదని ఆయన అన్నారు. అనేక మతాలపై తన సోదరుడికి అవగాహన ఉందని, చాలా కాలంగా ఆయన మత బోధకుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎవరితోనూ ఆయన మత మార్పిడి చేయించలేదని... కొందరు స్వచ్ఛందంగానే మతాన్ని మార్చుకున్నారని తెలిపారు. జకీర్ నాయక్ అక్రమాస్తులకు సంబంధించి ఈడీ ప్రస్తుతం విచారిస్తోంది. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో, కరీంను కూడా ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.