: ముందు చంపేస్తారనుకున్నా...తరువాత రేప్ చేస్తారనుకున్నా!: కిమ్ కర్దాషియాన్


పారిస్ లో దోపిడీకి గురైన ఘటనపై ప్రముఖ అమెరికా టీవీ రియాలిటిషో నటి కిమ్ కర్దాషియాన్ స్పందించింది. తన సోదరీమణులతో కలిసి ఓ టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా గత అక్టోబర్ లో చోటుచేసుకున్న ఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటన తరువాత తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పింది. ప్రధానంగా తన ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.

ఆ రోజు తన గదిలో ప్రవేశించిన దొంగలు...తన తలకు తుపాకీ గురిపెట్టారని చెప్పింది. ఆ క్షణంలో తనను చంపేస్తారని భావించానని చెప్పింది. తుపాకీ అలాగే ఉంచి తన నోటికి ప్లాస్టర్ వేశారని తెలిపింది. దీంతో తనను రేప్ చేస్తారని భావించానని, అరుస్తానన్న ఆలోచనతోనే వారు టేప్ అంటించారని, దీంతో మనసును కుదుటపరుచుకున్నానని చెప్పింది. తనపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా, తన నగలు మాత్రం ఎత్తుకుపోయారని కిమ్ వెల్లడించింది. ఈ కేసులో పురోగతి సాధించిన పారిస్ పోలీసులు జనవరిలో 16 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు. 

  • Loading...

More Telugu News