: షూటింగ్ లో పక్కటెముకలు విరిగి గాయపడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. జైలు జీవితం తరువాత ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భూమి' సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరుగుతోంది. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా సంజయ్ దత్ గాయపడ్డాడు. దాంతో ఆ ఎపిసోడ్ ను పెయిన్ కిల్లర్స్ వాడి పూర్తి చేశాడు. అయితే, నొప్పి ఇంకా పెరిగిపోతుండడంతో సంజయ్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా, పక్కటెముక విరిగినట్టు తేలింది. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, షూటింగ్ కు విశ్రాంతినిచ్చారు. మళ్లీ ఈ నెలాఖరున సంజయ్ దత్ కోలుకున్న తరువాత షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.