: పాతనోట్ల డిపాజిట్ల గడువు అంశంపై కేంద్రం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు


దేశంలోని అన్ని బ్యాంకుల్లో పాత‌నోట్ల‌ను జ‌మ చేసుకునే గ‌డువు గ‌త ఏడాది డిసెంబ‌రు 31నే ముగిసిన‌ప్ప‌టికీ, రిజ‌ర్వు బ్యాంకు శాఖ‌ల్లో మార్చి, 2017 చివ‌రి వ‌ర‌కు డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, ఆర్‌బీఐలోనూ ఆ నోట్లు స్వీక‌రించ‌క‌పోతుండ‌డంతో ప‌రిస్థితులు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌కు భిన్నంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది.

రద్దయిన నోట్ల‌ను జమ చేసేందుకు మార్చి 31 వరకు గడువు ఇస్తున్నట్లు ప్ర‌ధాని మోదీ చెప్పారు కదా! అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ పాత నోట్ల‌ను జ‌మ‌ చేసేందుకు మళ్లీ అవకాశం ఇస్తారో లేదో రెండు వారాల్లోగా అఫిడవిట్‌ అందజేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వ‌చ్చేనెల‌ 11కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News