: రామ మందిరం కోసం దేశ వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్న వీహెచ్ పీ


రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ సూచనను బీజేపీ స్వాగతించింది. అయితే, తాము మాత్రం దేశ వ్యాప్తంగా మరో సమరానికి సిద్ధమవుతున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. రామాలయం కోసం మరో ఉద్యమానికి తెరతీస్తున్నామని తెలిపింది. దేశ వ్యాప్తంగా రెండు లక్షల గ్రామాల్లో, యూపీలోని 70 వేల గ్రామాల్లో రామ మహోత్సవం నిర్వహిస్తామని వీహెచ్ పీ యూపీ జోనల్ అధ్యక్షుడు ఈశ్వరీ ప్రసాద్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రామ మందిరాన్ని రాముడు జన్మించిన ప్రదేశంలోనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 వరకు రామ మహోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్డినెన్సు ద్వారా జల్లికట్టును రక్షించారని... అదే ఆర్డినెన్సుతో రామ మందిరాన్ని ఎందుకు నిర్మించరాదని ప్రశ్నించారు.


  • Loading...

More Telugu News